Sunder Pichai: గ్లోబల్ లీడర్ షిప్ అవార్డుకు ఎంపికైన సుందర్ పిచాయ్!

  • అవార్డును ప్రకటించిన యూఎస్ ఐబీసీ
  • పిచాయ్ తో పాటు నాస్ డాక్ అధ్యక్షుడికి కూడా
  • వచ్చే వారంలో అవార్డు బహూకరణ

అమెరికా భారత వాణిజ్య మండలి (యూఎస్‌ ఐబీసీ) ప్రతి సంవత్సరమూ ఇచ్చే గ్లోబల్ లీడర్ షిప్ అవార్డుకు గూగుల్ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ఎంపికయ్యారు. 2019కి గాను సుందర్‌ పిచాయ్‌ తో పాటు నాస్‌ డాక్‌ ప్రెసిడెంట్ అడేనా ఫ్రైడ్‌ మాన్‌ ను ఎంపిక చేసినట్టు యూఎస్ ఐబీసీ పేర్కొంది. వీరి నేతృత్వంలోని కంపెనీలు ప్రపంచ సాంకేతిక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్న కారణంగా అవార్డును ఇస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే వారం జరగనున్న 'ఇండియా ఐడియాస్‌' సదస్సులో వారికి అవార్డును అందించనున్నట్టు వెల్లడించింది. గూగుల్‌, నాస్‌ డాక్‌ ల కృషితో గత సంవత్సరం ఇండియా, యూఎస్ ల మధ్య వస్తుసేవల ద్వైపాక్షిక వాణిజ్యం 150 శాతం మేరకు పెరిగిందని ఈ సందర్భంగా యూఎస్‌ ఐబీసీ తెలిపింది.

కాగా, తనకు అవార్డును ప్రకటించిన సందర్భంగా సుందర్ పిచాయ్ స్పందించారు. గూగుల్ కంపెనీకి భారత్ ఎంతో ముఖ్యమైన మార్కెట్ అని, తమ సంస్థ అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందిస్తోందని అన్నారు. టెక్నాలజీ అందుబాటుతో జీవన విధానం మెరుగుపడిందన్నారు.

More Telugu News