Iftar: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌కు షాకిచ్చిన అమిత్ షా

  • ఇఫ్తార్ విందులో పాల్గొన్న నితీశ్, రాంవిలాస్ పాశ్వాన్
  • ఇదే ఉత్సాహం నవరాత్రి ఉత్సవాల్లోనూ కనబరచాలని సూచన
  • పిలిపించుకుని తలంటిన అమిత్ షా

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌‌కు హోం మంత్రి అమిత్‌షా తలంటారు. అనవసర ప్రకటనలు చేసి పార్టీని, ఎన్డీయే పక్షాలను చిక్కుల్లోకి నెట్టవద్దని వార్నింగ్ ఇచ్చారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఎల్‌జేపీ చీఫ్ రాంవిలాస్ పాశ్వాన్, ఇతర నేతలు హాజరైన ఇఫ్తార్ విందుకు సంబంధించి గిరిరాజ్ సింగ్ మంగళవారం ఓ ట్వీట్ చేశారు. ఇఫ్తార్ విందులో కనబరుస్తున్న జోరును నవరాత్రి ఉత్సవాల్లో  ఎందుకు చూపించరంటూ గిరిరాజ్ సింగ్ ఆ ట్వీట్‌లో ప్రశ్నించారు. ఇదే ఉత్సాహం నవరాత్రి ఉత్సవాల్లోనూ చూపిస్తే ఆ ఫొటోలు ఇంకా బాగుంటాయంటూ ఫొటోలు కూడా ట్వీట్ చేశారు. దీంతో మిత్రపక్ష నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

గిరిరాజ్ ట్వీట్‌ బీజేపీని, భాగస్వామ్య పార్టీలను ఇరుకున పెట్టేలా ఉండడంతో అమిత్ షా వెంటనే స్పందించారు. గిరిరాజ్‌ను పిలిపించుకుని మాట్లాడారు. అనవసర ప్రకటనలు చేసి పార్టీని, మిత్ర పక్షాలను ఇరుకున పెట్టవద్దంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇటువంటి ప్రకటనలు చేయవద్దని హెచ్చరించారు.

More Telugu News