Chandrababu: టీడీపీ విప్‌గా కేశినేని నాని.. రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా సీఎం రమేష్‌‌

  • పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం
  • తాజా రాజకీయ పరిణామాలపై చర్చ
  • ఏపీ భవనాలను గవర్నర్ ఏకపక్షంగా తెలంగాణకు అందించారన్న నేతలు

ఈ నెల 7న విదేశీ పర్యటనకు వెళ్లనున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం అమరావతిలోని తన నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. తాను లేని సమయంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాదులోని ఏపీ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ ఇటీవల గవర్నర్ నరసింహన్ తీసుకున్న నిర్ణయంపైనా సమావేశంలో చర్చించారు. గవర్నర్ నిర్ణయం ఏకపక్షమని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు.

కాగా, ఎంపీ కేశినేని నానిని లోక్‌సభలో టీడీపీ ఉపనేతగా, పార్టీ విప్‌గా ఎన్నుకోగా, సీఎం రమేశ్‌ను రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో కిమిడి కళావెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమ, గల్లా జయదేవ్, కేశినేని నాని, మరికొందరు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

More Telugu News