Triple Talaq: తిరిగి పార్లమెంట్ ముందుకు ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకొస్తాం: కేంద్ర న్యాయశాఖా మంత్రి

  • రాజ్యసభలో పెండింగ్ పడిన బిల్లు
  • లోక్‌సభ రద్దుతో బిల్లుకు కాలం చెల్లింది
  • మేనిఫెస్టోలో కూడా ట్రిపుల్ తలాక్ ఒక అంశం

లోక్‌సభలో ఆమోదం పొంది రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న ట్రిపుల్ తలాక్ బిల్లును తిరిగి పార్లమెంటు ముందుకు తీసుకొస్తామని న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. లోక్‌సభలో ఆమోదం పొంది రాజ్యసభలో ప్రవేశపెట్టే సమయానికి 16వ లోక్‌సభ రద్దు కావడంతో ఈ బిల్లుకు కాలం చెల్లింది.

బీజేపీ మేనిఫెస్టోలో ట్రిపుల్ తలాక్ రద్దు కూడా ఒక అంశమని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పౌరస్మృతి గురించి ఆయన మాట్లాడుతూ, రాజకీయ సంప్రదింపులు జరిపి, లా కమిషన్ నివేదిక తెప్పిస్తామని పేర్కొన్నారు.

More Telugu News