Vijayawada: విజయవాడ దుర్గగుడి ఉద్యోగుల చేతివాటం...అమ్మవారి బంగారం చోరీ

  • హుండీ ఆదాయం లెక్కిస్తుండగా ఘటన
  • దొంగిలించి భార్యకు అందించిన నిందితుడు
  • దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పనిచేస్తున్న దంపతులు హుండీ లెక్కింపు సందర్భంగా చేతివాటం ప్రదర్శించి ఎనిమిది గ్రాముల బంగారాన్ని చోరీ చేశారు. అధికారులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కటకటాల పాలయ్యారు.

పోలీసుల కథనం మేరకు....దుర్గగుడిలో సింహాచలం అనే ఉద్యోగి గత కొంతకాలంగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య కూడా గుడిలోనే కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తోంది. అమ్మవారి హుండీలో భక్తులు వేసిన కానుకల లెక్కింపు సందర్భంగా దంపతులు ఇద్దరూ చోరీకి పాల్పడ్డారు. సింహాచలం బంగారం తస్కరించి భార్య చేతికి అందించగా ఆమె దాన్ని భద్రపరిచింది. ఈ విషయాన్ని గుర్తించిన దేవస్థానం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News