Telangana: తెలంగాణ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు: సంగారెడ్డిలో మాత్రమే కాంగ్రెస్ నుంచి పోటీ... మిగతా జిల్లాల్లో టీఆర్ఎస్ హవా!

  • చురుకుగా సాగుతున్న ఓట్ల లెక్కింపు
  • ఒక్కొక్కటిగా వెల్లడవుతున్న ఫలితాలు
  • అన్ని చోట్లా గులాబీ గుబాళింపే!

తెలంగాణలో గత నెలలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. కౌంటింగ్ కేంద్రాల్లో నుంచి తొలుత ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఒక్క సంగారెడ్డి జిల్లాలో మాత్రమే టీఆర్ఎస్ కు కాంగ్రెస్ గట్టిపోటీని ఇస్తోంది. మిగతా అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ తన హవాను చూపుతోందని ట్రెండ్స్ చెబుతున్నాయి.

ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాలను పరిశీలిస్తే...

* ఆదిలాబాద్ జిల్లాలో 14 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 7 ఎంపీటీసీలను కాంగ్రెస్, 9 ఎంపీటీసీలను బీజేపీ గెలుచుకున్నాయి.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 27 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 4 ఎంపీటీసీలను కాంగ్రెస్ గెలుచుకున్నాయి.
* ఆసిఫాబాద్ కొమరంభీమ్ జిల్లాలో 13 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 1 ఎంపీటీసీని కాంగ్రెస్ గెలుచుకున్నాయి.
* జనగామ జిల్లాలో 19 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 1 ఎంపీటీసీని కాంగ్రెస్ గెలుచుకున్నాయి.
* మెదక్ జిల్లాలో 9 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 2 ఎంపీటీసీలను కాంగ్రెస్ గెలుచుకున్నాయి.
* మేడ్చల్ జిల్లాలో 1 ఎంపీటీసీని టీఆర్ఎస్, 2 ఎంపీటీసీలను కాంగ్రెస్ గెలుచుకున్నాయి.
* నల్గొండ జిల్లాలో 10 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 4 ఎంపీటీసీలను కాంగ్రెస్ గెలుచుకున్నాయి.
* నిజామాబాద్ జిల్లాలో 77 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 16 ఎంపీటీసీలను కాంగ్రెస్, 9 ఎంపీటీసీలను బీజేపీ గెలుచుకున్నాయి.
* సిద్ధిపేట జిల్లాలో 29 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 3 ఎంపీటీసీలను కాంగ్రెస్ గెలుచుకున్నాయి.
* పెద్దపల్లి జిల్లాలో 29 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 10 ఎంపీటీసీలను కాంగ్రెస్, 3 ఎంపీటీసీలను బీజేపీ గెలుచుకున్నాయి.
* సూర్యాపేట జిల్లాలో 28 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 14 ఎంపీటీసీలను కాంగ్రెస్, 2 ఎంపీటీసీలను బీజేపీ గెలుచుకున్నాయి.
* సంగారెడ్డి జిల్లాలో 40 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 32 ఎంపీటీసీలను కాంగ్రెస్, 2 ఎంపీటీసీలను బీజేపీ గెలుచుకున్నాయి.
* వికారాబాద్ జిల్లాలో 7 ఎంపీటీసీలను టీఆర్ఎస్ గెలుచుకుంది.
* యాదాద్రి భువనగిరి జిల్లాలో 5 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 5 ఎంపీటీసీలను కాంగ్రెస్ గెలుచుకున్నాయి.
* వనపర్తి జిల్లాలో 21 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 4 ఎంపీటీసీలను కాంగ్రెస్ గెలుచుకున్నాయి.
* రంగారెడ్డి జిల్లాలో 13 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 7 ఎంపీటీసీలను కాంగ్రెస్, 2 ఎంపీటీసీలను బీజేపీ గెలుచుకున్నాయి.
* రాజన్న సిరిసిల్ల జిల్లాలో 32 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 8 ఎంపీటీసీలను కాంగ్రెస్, 2 ఎంపీటీసీలను బీజేపీ గెలుచుకున్నాయి.
* నిర్మల్ జిల్లాలో 17 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 6 ఎంపీటీసీలను కాంగ్రెస్, 1 ఎంపీటీసీని బీజేపీ గెలుచుకున్నాయి.
* మంచిర్యాల జిల్లాలో 4 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 1 ఎంపీటీసీని కాంగ్రెస్ గెలుచుకున్నాయి.
* మహబూబ్ నగర్ జిల్లాలో 63 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 17 ఎంపీటీసీలను కాంగ్రెస్, 5 ఎంపీటీసీలను బీజేపీ గెలుచుకున్నాయి.
* కరీంనగర్ జిల్లాలో 62 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 17 ఎంపీటీసీలను కాంగ్రెస్, 8 ఎంపీటీసీలను బీజేపీ గెలుచుకున్నాయి.
* కామారెడ్డి జిల్లాలో 81 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 21 ఎంపీటీసీలను కాంగ్రెస్ గెలుచుకున్నాయి.
* మహబూబాబాద్ జిల్లాలో 29 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 10 ఎంపీటీసీలను కాంగ్రెస్ గెలుచుకున్నాయి.
* జగిత్యాల జిల్లాలో 60 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 15 ఎంపీటీసీలను కాంగ్రెస్, 9 ఎంపీటీసీలను బీజేపీ గెలుచుకున్నాయి.
* ఖమ్మం జిల్లాలో 19 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 9 ఎంపీటీసీలను కాంగ్రెస్ గెలుచుకున్నాయి.
* జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 23 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 6 ఎంపీటీసీలను కాంగ్రెస్ గెలుచుకున్నాయి.
*నాగర్ కర్నూలు జిల్లాలో 22 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 10 ఎంపీటీసీలను కాంగ్రెస్, 2 ఎంపీటీసీలను బీజేపీ గెలుచుకున్నాయి.
* వరంగల్ (రూరల్) జిల్లాలో 14 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 6 ఎంపీటీసీలను కాంగ్రెస్ గెలుచుకున్నాయి.
* వరంగల్ (అర్బన్) జిల్లాలో 18 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 2 ఎంపీటీసీలను కాంగ్రెస్ గెలుచుకున్నాయి.
* జోగులాంబ గద్వాల జిల్లాలో 19 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 3 ఎంపీటీసీలను కాంగ్రెస్ గెలుచుకున్నాయి.
* ములుగు జిల్లాలో 9 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 8 ఎంపీటీసీలను కాంగ్రెస్ గెలుచుకున్నాయి.
* నారాయణపేట జిల్లాలో 18 ఎంపీటీసీలను టీఆర్ఎస్, 9 ఎంపీటీసీలను కాంగ్రెస్, 8 ఎంపీటీసీలను బీజేపీ గెలుచుకున్నాయి.

More Telugu News