Wada: డోపింగ్ టెస్ట్ కు శాంపిల్ ఇవ్వాలని బుమ్రాకు పిలుపు!

  • ర్యాండమ్ టెస్ట్ లో భాగంగా వాడా ఏజన్సీ నుంచి పిలుపు
  • నిషేధిత ఉత్ప్రేరకాలు వాడారా? అన్న విషయమై పరిశీలన
  • రేపటి మ్యాచ్ కోసం ఆటగాళ్ల ముమ్మర ప్రాక్టీస్

భారత క్రికెట్ పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాకు డోప్ టెస్ట్ జరుగనుంది. ర్యాండమ్‌ టెస్ట్ లో భాగంగా యూరిన్ శాంపిల్‌ ఇవ్వాలని బుమ్రాకు వాడా తరఫున పనిచేసే ఏజన్సీ నుంచి సమాచారం అందింది. వాడా తరఫున ఇదే ఏజెన్సీ శాంపిల్ ను పరీక్షించి, బుమ్రా ఏమైనా నిషేధిత ఉత్ప్రేరకాలు వాడాడా? అన్న విషయాన్ని తేల్చనుంది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే, మరోసారి శాంపిల్ తీసుకుని పరీక్షలు నిర్వహిస్తారు. ఆపై కూడా అదే రిజల్ట్స్ వస్తే, తీసుకున్న ఉత్ప్రేరకం చూపే ప్రభావం ఆధారంగా కఠిన నిర్ణయాలు ఉంటాయి. అది ఆటగాడిపై నిషేధం వరకూ ఉండవచ్చు.
ఇదిలావుండగా, బుధవారం నాడు దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడాల్సి వున్న భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ లో చమటోడ్చింది. ముఖ్యంగా రోహిత్‌ శర్మ తీవ్రంగా ప్రాక్టీస్‌ చేశాడు. భారత బౌలర్లతో బాల్స్ వేయించుకుంటూ, భారీ షాట్లు ఆడాడు. త్రోడౌన్‌ లు ఆడుతున్న క్రమంలో ఓ బాల్ రోహిత్ చేతికి బలంగా తాకడంతో కాసేపు విలవిల్లాడాడు. ఆపై నొప్పి తగ్గడంతో తన ప్రాక్టీస్‌ ను కొనసాగించాడు.

More Telugu News