IAF: అరుణాచల్ ప్రదేశ్ లో ఐఏఎఫ్ విమాన శకలాలు లభ్యం

  • 15 మందితో ప్రయాణిస్తున్న విమానం
  • టేకాఫ్ తర్వాత ఆచూకీ లేకుండాపోయిన విమానం
  • సుఖోయ్-30 యుద్ధ విమానంతో గాలింపు

ఇవాళ 15 మందితో ప్రయాణిస్తున్న భారత వాయుసేన విమానం ఏఎన్-32 ఆచూకీ లేకుండా పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వెంటనే అప్రమత్తమైన వాయుసేన సుఖోయ్-30 యుద్ధ విమానంతోపాటు మరికొన్ని హెలికాప్టర్లను రంగంలోకి దింపింది. తీవ్రస్థాయిలో గాలింపు అనంతరం అరుణాచల్ ప్రదేశ్ లో విమాన శకలాలను గుర్తించారు. వెస్ట్ సియాంగ్ జిల్లాలోని టాటోకు ప్రాంతంలో విమానం కూలిపోయినట్టు అంచనా వేస్తున్నారు.

ఈ విమానం అసోంలోని జోర్హాట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ లోని మెచుకా ఎయిర్ బేస్ కు వెళ్లాల్సి ఉంది. అయితే, టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటి తర్వాత విమానానికి గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి. రాడార్ పై విమానం ఆచూకీ కనిపించలేదు. కాగా, విమానం కూలిపోయిన ప్రాంతం పర్వతాలతో కూడిన ప్రదేశం కావడంతో శకలాల వెలికితీతకు మరింత సమయం పట్టనుంది.

More Telugu News