sensex: మార్కెట్లలో ఫుల్ జోష్.. చరిత్ర సృష్టించిన నిఫ్టీ

  • 553 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 12వేల మార్కును అధిగమించిన నిఫ్టీ
  • 6శాతం పైగా లాభపడ్డ హీరో మోటో కార్ప్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు పరుగులు పెట్టాయి. సెన్సెక్స్ 40వేల మార్కుపైన క్లోజ్ కాగా... నిఫ్టీ చరిత్రలో తొలిసారి 12వేల మైలురాయిని అధిగమించింది. దేశ ఆర్థిక వృద్ధి రేటు 5.8 శాతానికి నెమ్మదించిన నేపథ్యంలో, కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గిస్తుందనే అంచనాలతో మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 553 పాయింట్లు లాభపడి 40,268 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ 166 పాయింట్లు పెరిగి 12,089కి ఎగబాకింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హీరో మోటో కార్ప్ (6.01%), బజాజ్ ఆటో (3.92%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.70%), ఏసియన్ పెయింట్స్ (3.65%), మారుతి సుజుకి (2.89%).

టాప్ లూజర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (-0.13%), ఎన్టీపీసీ (-0.11%), ఐటీసీ లిమిటెడ్ (-0.04%).        

More Telugu News