women: బస్సులు, మెట్రో రైళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణం: సీఎం కేజ్రీవాల్ ప్రకటన

  • త్వరలోనే మహిళలు ఉచితంగా ప్రయాణించబోతున్నారు. 
  • రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 700 కోట్ల అదనపు భారం
  • మహిళల రక్షణే తమ లక్ష్యం

అతి త్వరలోనే ఢిల్లీలోని మహిళలు ఉచితంగా ప్రయాణించబోతున్నారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. బస్సులు, మెట్రో రైళ్లలో ఉచితంగా మహిళలు ప్రయాణించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమం వల్ల ఢిల్లీ ప్రభుత్వంపై ఈ ఏడాది రూ. 700 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు.

మెట్రో టికెట్లను కొని ప్రయాణించేంత ఆర్థిక సామర్థ్యం అందరు మహిళలకు ఉండదని... టికెట్ కొనుగోలు చేయగలిగిన శక్తి ఉన్నవారు కొనుక్కోవచ్చని... టికెట్ కొనలేనివారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. ఈ ఖర్చును మొత్తం ఢిల్లీ  ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు.

ప్రజాధనాన్ని ప్రజల కోసమే వినియోగిస్తున్న ఏకైక ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వమే అని కేజ్రీవాల్ చెప్పారు. మహిళల రక్షణకు తాము అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని చెప్పారు. కేజ్రీవాల్ ప్రకటనపై బీజేపీ మండిపడింది. ఆయన ప్రకటనల ముఖ్యమంత్రి మాత్రమేనని విమర్శించింది.

More Telugu News