karthikeya: 'హిప్పీ' చేయడానికి కారణమదే: హీరో కార్తికేయ

  • ఏడాదిగా చాలా కథలు విన్నాను 
  • కొన్ని కథలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను
  •  ఈ నెల 6వ తేదీన విడుదల   

'ఆర్ ఎక్స్ 100' సినిమాతో హీరో కార్తికేయ యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. దాంతో ఆయన తదుపరి సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'హిప్పీ' ఈ నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'ఆర్ ఎక్స్ 100' సినిమా తరువాత నేను చాలా కథలు విన్నాను. వాటిలో కొన్ని కథలను ఎంచుకుని వాటిని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఎంచుకున్న ఈ కథల్లో 'ఆర్ ఎక్స్ 100' కి పూర్తి భిన్నంగా ఏది వుందో చూసుకున్నాను. ఎందుకంటే 'ఆర్ ఎక్స్ 100'తో పోలిక రాకూడదని అలా చేశాను. అలాంటప్పుడు కథాకథనాల పరంగా .. లుక్ పరంగా పూర్తి భిన్నంగా నాకు 'హిప్పీ' కనిపించింది. అందువల్లనే ఈ సినిమా చేశాను" అని చెప్పుకొచ్చారు.

More Telugu News