akshay kumar: అక్షయ్ కుమార్ రిక్వెస్ట్ .. తిరిగొచ్చిన లారెన్స్

  • అక్షయ్ కుమార్ హీరోగా 'లక్ష్మీ బాంబ్'
  • నిర్మాతల తీరుపట్ల లారెన్స్ అసహనం
  •  షూటింగు మొదలయ్యేలా చేసిన అక్షయ్

 అక్షయ్ కుమార్ కథానాయకుడిగా 'కాంచన' సినిమాను 'లక్ష్మీ బాంబ్' పేరుతో హిందీలోకి రీమేక్ చేయడానికి దర్శకుడిగా లారెన్స్ రంగంలోకి దిగాడు. అయితే లారెన్స్ ప్రమేయం లేకుండా నిర్మాతలు ఇటీవల ఈ సినిమా ఫస్టులుక్ ను వదిలారు. దాంతో లారెన్స్ చాలా ఫీలయ్యాడు. దర్శకుడినైన తనకి తెలియకుండా తన సినిమా నుంచి ఫస్టులుక్ రావడం పట్ల ఆయన చాలా హర్ట్ అయ్యాడు.

ఒక దర్శకుడిగా తనని గౌరవించనందున తాను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించాడు. దాంతో ఈ ప్రాజెక్టు విషయంలో అభిమానుల్లో అయోమయం నెలకొంది. దాంతో అక్షయ్ కుమార్ రంగంలోకి దిగి, లారెన్స్ ను బుజ్జగించాడట. ఆయన రిక్వెస్ట్ చేయడంతో లారెన్స్ తన పంతాన్ని పక్కకి పెట్టేశాడు. శనివారం రోజున ఈ సినిమా షూటింగు ఆయన చేతుల మీదుగానే తిరిగి మొదలైంది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ అక్షయ్ తో దిగిన ఫొటోను పోస్ట్ చేయడంతో, అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News