vijay devarakonda: ఫ్రాన్స్ లో విజయ్ దేవరకొండ సందడి

  • తెలుగు తెరకి మరో రొమాంటిక్ ఎంటర్టైనర్
  • క్రాంతిమాధవ్ తో విజయ్ దేవరకొండ 
  • సంగీత దర్శకుడిగా గోపీసుందర్

భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేసిన 'డియర్ కామ్రేడ్' సినిమా, వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, విజయ్ దేవరకొండ ఆ తరువాత సినిమాపై పూర్తి దృష్టిపెట్టాడు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై .. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

ప్రధాన కథానాయికగా రాశి ఖన్నా నటిస్తుండగా, మరో ఇద్దరు కథానాయికలుగా ఐశ్వర్య రాజేశ్ .. ఇజబెల్లా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు ఫ్రాన్స్ లో జరుగుతోంది. నాయకా నాయికలకు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాకి టైటిల్ ఏమిటనేది త్వరలోనే ప్రకటించనున్నారు. 

More Telugu News