TRS: టీఆర్ఎస్ 'తీన్'మార్... రంగారెడ్డిలోనూ జయకేతనం!

  • గెలిచిన మహేందర్ రెడ్డి
  • ఒక్క నల్గొండలోనే కాంగ్రెస్ నుంచి పోటీ
  • మిగతా చోట్ల భారీ విజయాలు

మూడు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగగా, మూడింటిలోనూ టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. తాజాగా, రంగారెడ్డి జిల్లా ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, టీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచిన మహేందర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డిపై గెలిచారు. పోలైన ఓట్లలో మహేందర్ రెడ్డికి 510, ప్రతాప్ రెడ్డికి 266 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన 244 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

ఇప్పటికే నల్గొండ, వరంగల్ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒక్క నల్గొండలో మినహా మిగతా రెండు చోట్లా కాంగ్రెస్ గట్టి పోటీని ఇవ్వలేకపోయింది. నల్గొండ జిల్లాలో మొత్తం ఓట్లు 1085కాగా, 1073 ఓట్లు పోలయ్యాయి. వీటిల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డికి 640 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థిని కోమటిరెడ్డి లక్ష్మికి 414 ఓట్లు రాగా, మరో 19 చెల్లలేదని అధికారులు ప్రకటించారు. మూడు స్థానాల గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. 

More Telugu News