Shruti Hassan: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • శ్రుతిహాసన్ కు భారీ ఆఫర్లు 
  • నాని సినిమా వార్తలో నిజం లేదట!
  • స్పోర్ట్స్ నేపథ్యంలో ఆది పినిశెట్టి 

*  ప్రియుడు మైఖేల్ తో తెగదెంపులు చేసుకున్నాక కథానాయిక శ్రుతి హాసన్ మళ్లీ సినిమాలపై దృష్టి పెడుతోంది. ఈ క్రమంలో రెండు సినిమాలలో నటించే అవకాశం వుందని వార్తలొస్తున్నాయి. చిరంజీవి-కొరటాల కాంబో సినిమాలోను; రవితేజ-గోపీచంద్ మలినేని కాంబోలోను ఆమెకు అవకాశాలు వచ్చినట్టు సమాచారం.  
*  నాని హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టుగా గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే, ఇందులో వాస్తవం లేదని హీరో నాని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశాడు.
*  అటు హీరోగా నటిస్తూనే అప్పుడప్పుడు విలన్ గా కూడా నటిస్తున్న ఆది పినిశెట్టి త్వరలో స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథతో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. ఈ విషయం గురించి ఆది చెబుతూ, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రెండు భాషల్లో రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 12న మొదలవుతుందని పేర్కొన్నాడు. మిగతా వివరాలన్నీ త్వరలో ప్రకటిస్తానన్నాడు.

More Telugu News