రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నృత్యకారుడు హరీశ్‌కుమార్ సహా మరో ముగ్గురు నృత్యకారుల మృతి

02-06-2019 Sun 18:21
  • జైసల్మేర్ నుంచి అజ్మీర్‌కు వెళుతుండగా ప్రమాదం
  • క్వీన్ హరీశ్‌గా గుర్తింపు పొందిన హరీశ్ కుమార్
  • దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన సీఎం అశోక్ గెహ్లాట్

నేటి ఉదయం రాజస్థాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నృత్యకళాకారుడితో పాటు మరో ముగ్గురు నృత్యకారులు మృతి చెందారు. జైసల్మేర్ నుంచి అజ్మీర్‌కు అంతా ఎస్‌యూవీ వాహనంలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రముఖ నృత్యకారుడు హరీశ్ కుమార్ మరణించారు.

ఆయన క్వీన్ హరీశ్‌గా బాగా గుర్తింపు పొందారు. ఎస్‌యూవీ వాహనం లారీని ఢీకొట్టడంతో వాహనంలోని వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాద విషయాన్ని తెలుసుకున్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.