Andhra Pradesh: తెలంగాణలో నిరుద్యోగ భ‌ృతి ఇస్తామన్నారు.. ఇంతవరకూ విధివిధానాలే ఖరారు కాలేదు!: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • కేంద్రం విభజన హామీలు అమలుచేయలేదు
  • సోనియా వల్లే ప్రత్యేక తెలంగాణ వచ్చింది
  • తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షుడు

ఏపీ విభజన చట్టం సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోనియాగాంధీ వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో తెలంగాణ కోసం కాంగ్రెస్ సభ్యులు పోరాడారని గుర్తుచేశారు. గాంధీభవన్ లో ఈరోజు నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఉత్తమ్ పాల్గొన్నారు.

అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో నిరుద్యోగభృతి ఇస్తామన్న కేసీఆర్, ఇంతవరకూ విధివిధానాలు రూపొందించలేదని మండిపడ్డారు. తెలంగాణ రైతుల రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం యథేచ్ఛగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని మండిపడ్డారు.

టీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యబద్ధమైన రంగాలను ప్రభుత్వం అణచివేస్తోందని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News