Andhra Pradesh: టీడీపీ నేత సుజనా చౌదరి ఇళ్లు, ఆఫీసుల్లో కొనసాగుతున్న సీబీఐ, ఈడీ సోదాలు!

  • నిన్న ప్రారంభమైన తనిఖీలు
  • నలుగురు డైరెక్టర్లు అదుపులోకి
  • ఆంధ్రాబ్యాంక్ కు రూ.71 కోట్ల రుణం ఎగ్గొట్టిన కేసులో విచారణ

'బెస్ట్‌ అండ్ కాంప్టన్‌' కంపెనీ పేరుతో ఆంధ్రా బ్యాంకుకు రూ.71 కోట్లు ఎగ్గొట్టిన కేసులో టీడీపీ నేత, కేంద్ర మాజీమంత్రి సుజానా చౌదరి ఇళ్లు, కార్యాలయాలపై రెండో రోజూ సీబీఐ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తారు. ఇప్పటికే ఈ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్లు జీ శ్రీనివాసరాజు, వెంకటరమణారెడ్డి, పి.సుధాకర్‌ రెడ్డి, వెంకటకల్యాణ్‌ రాజులను అదుపులోకి తీసుకున్నారు.

కర్ణాటకలో వ్యాపారం నిర్వహించిన బెస్ట్ అండ్ కాంప్టన్ సంస్థ తప్పుడు ఇన్వాయిస్ లను సృష్టించి ఆంధ్రా బ్యాంక్ నుంచి రూ.71 కోట్ల రుణం పొందింది. అయితే ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో సీబీఐ కేసు నమోదుచేసింది. నిన్న సుజనా ఇళ్లు, కార్యాలయాలపై దాడిచేసిన అధికారులు పలు కీలక పత్రాలు, హార్డ్ డ్రైవ్ లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

More Telugu News