Microsoft: 'బ్లూకీప్'తో జాగ్రత్త... వినియోగదారులను హెచ్చరించిన మైక్రోసాఫ్ట్

  • పది లక్షల కంప్యూటర్లకు వైరస్ ముప్పు
  • ప్రమాదకర మాల్వేర్ అంటున్న మైక్రోసాఫ్ట్
  • సిస్టమ్స్ అప్ డేట్ చేసుకోవడం ఒక్కటే మార్గం అని సూచన

నేటి ఇంటర్ నెట్ యుగంలో కంప్యూటర్లకు ప్రధానంగా వైరస్ లు, మాల్వేర్లతో అపారమైన నష్టం వాటిల్లుతుంది. 2017లో వచ్చిన వాన్నాక్రై మాల్వేర్ అనేక దేశాల్లో కొన్ని వందల కోట్ల మేర నష్టాన్ని కలిగించింది. ఇప్పుడు ఆ స్థాయిలో కాకపోయినా పది లక్షల కంప్యూటర్లకు ప్రమాదం పొంచి ఉందంటూ మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజం హెచ్చరికలు చేయడం అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది.

బ్లూకీప్ అనే వైరస్ ఇంటర్నెట్లో కంప్యూటర్లను నాశనం చేస్తోందని, దీని బారి నుంచి తప్పించుకోవాలంటే సిస్టమ్స్ ను వెంటనే అప్ డేట్ చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. ఇది ఎక్కువగా విండోస్ ఎక్స్ పీ, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్ 7 ఆధారిత కంప్యూటర్లపై ప్రభావం చూపిస్తున్నట్టు తెలిపింది. బ్లూకీప్ కు యాంటీవైరస్ సొల్యూషన్ సిద్ధం చేశామని, అప్పటినుంచి దాని జాడ కనిపించకపోయినా అది పూర్తిగా తొలగిపోయినట్టుగా భావించకూడదని మైక్రోసాఫ్ట్ వర్గాలు అంటున్నాయి.

More Telugu News