ysr akshaya patra: మధ్యాహ్న భోజన పథకం పేరు మార్చిన ఏపీ ముఖ్యమంత్రి

  • వైయస్ఆర్ అక్షయపాత్రగా నామకరణం
  • వంట కార్మికుల వేతనాన్ని రూ. 3 వేలకు పెంచుతామన్న సీఎం
  • ఆహారం నాణ్యత విషయంలో రాజీ పడవద్దని ఆదేశం

పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పథకం పేరు మారింది. ఈ పథకానికి వైయస్ఆర్ అక్షయ పాత్రగా నామకరణం చేశారు. ఇకపై ఈ పథకాన్ని ఈ పేరుతోనే పిలుస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.

అంతేకాదు, మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులకు ఇప్పటి వరకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ. 1000 నుంచి రూ. 3000లకు పెంచనున్నట్టు ప్రకటించారు. మధ్యాహ్న భోజన పథకంపై సమీక్ష నిర్వహించిన జగన్... ఆహారం నాణ్యత విషయంలో రాజీపడవద్దని ఆదేశించారు. పరిశుభ్రతను పాటించాలని, సకాలంలో ఆహారం పాఠశాలలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యా వ్యవస్థ చక్కగా కొనసాగినప్పుడే... రాష్ట్రం ఉన్నత పథంలో పయనిస్తుందని చెప్పారు.

More Telugu News