China: జీడీపీలో భారత్ ను అధిగమించిన చైనా!

  • ఐదేళ్ల కనిష్టానికి భారత జీడీపీ వృద్ధిరేటు
  • మార్చితో ముగిసిన త్రైమాసికంలో 5.8 శాతం వృద్ధిరేటు
  • 6.8 శాతం పురోగతి సాధించిన చైనా

కేంద్రంలో రెండోసారి అధికారాన్ని చేపట్టిన నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత జీడీపీ వృద్ధిరేటు ఐదేళ్ల కనిష్టానికి పడిపోవడం చైనాకు కలిసొచ్చింది. జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ 5.8 శాతం పురోగతి సాధించగా అదే సమయంలో చైనా 6.8 శాతం పురోగతి సాధించింది. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అన్న ట్యాగ్‌లైన్‌ను భారత్ కోల్పోయింది. ఇప్పుడు దానిని చైనా సొంతం చేసుకుంది. భారత జీడీపీ వృద్ధి రేటును చైనా అధిగమించడం ఇదే తొలిసారి.  

అక్టోబరు నుంచి డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతం ఉండగా మార్చితో ముగిసిన త్రైమాసికానికి భారీగా పడిపోయింది. కాగా, 2018-19లో జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతమని సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్ఓ) పేర్కొంది. అయితే, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 7.2 శాతంగా ఉండడం గమనార్హం.

More Telugu News