CM Jagan: సీఎం జగన్‌ ఇంటివద్ద తచ్చాడిన బాలుడు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు!

  • అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది
  • ఎందుకొచ్చావని విచారిస్తున్న పోలీసులు
  • వెనుక ఎవరైనా ఉన్నారా అని ఆరా

పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్న ముఖ్యమంత్రి ఇంటి పరిసరాల్లోకి ఓ పదేళ్ల బాలుడు రావడం, దర్జాగా అక్కడ తిరుగుతుండడంతో భద్రతా సిబ్బందిలో ఒక్కసారిగా కలకలం ప్రారంభమైంది. బాలుడి అనుమానాస్పద కదలికలను గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయం వద్ద ఈరోజు ఉదయం ఈ బాలుడు సంచరిస్తుండగా పట్టుకుని స్టేషన్‌కి తరలించారు. తన పేరు శివకుమార్‌ అని, ఊరు బాలతిమ్మయ్యగారి పల్లె అని చెప్పాడు. అయితే ఈ గ్రామం ఎక్కడ ఉన్నదీ పోలీసులకు అర్థంకాక ఆరా తీస్తున్నారు.

 కాగా, విచారణ సందర్భంగా ఈ బాలుడు పోలీసులకే ఎదురు ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. సదరు బాలుడుని అనాథ బాలల ఆశ్రమానికి పోలీసులు తరలించారు. సీఎం సెక్యూరిటీ జోన్‌లోకి ఈ బాలుడు ఎందుకు వచ్చాడు? సీఎం ఇంటివద్ద ఎందుకు తిరుగుతున్నాడు? ఎవరైనా వెనకుండి ఈ బాలుడిని పంపించారా? అన్న అంశాలపై ఆరాతీస్తున్నారు.

More Telugu News