RGV: 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' చిత్రం కమ్మ వర్గీయులను లక్ష్యంగా చేసుకుని తీయడంలేదు: వర్మ

  • ఇది విజయవాడ రాజకీయాలపై చిత్రం
  • నాకు ఏ కులం లేదు, కులంపై నమ్మకం లేదు
  • ట్విట్టర్ లో వర్మ వివరణ

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ప్రకటించిన చిత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. ఈ సినిమా టైటిల్ ఎంతో ఆసక్తికరంగా ఉండడంతో సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీ ఎన్నికల్లో వైసీపీ గెలిచి జగన్ సీఎం అయిన తరుణంలో వర్మ ఈ సినిమాను ప్రకటించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ సినిమా టైటిల్ లో కమ్మ, రెడ్లు అనే పదాలు కులాల్ని సూచిస్తుండడంతో దీనిపై వర్మ వివరణ ఇచ్చారు.

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' చిత్రం కమ్మ వర్గీయులను లక్ష్యంగా చేసుకుని తీస్తున్న చిత్రం కాదని స్పష్టం చేశారు. దీనిపై కొందరు అపోహపడుతున్నట్టు అర్థమవుతోందని, కానీ తన చిత్రం కమ్మ సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని తీయడంలేదని ట్వీట్ చేశారు. ఈ తరహా ప్రచారంలో నిజంలేదని పేర్కొన్నారు. తనకు ఏ కులం లేదని, కులంపై నమ్మకమే లేదని తెలిపారు. విజయవాడలో ఉండే విభిన్న రాజకీయ వాతావరణం ఆధారంగా తన చిత్ర కథ ఉంటుందని వర్మ తన ట్వీట్ లో విశదీకరించారు.

RGV

More Telugu News