Cricket: వరల్డ్ కప్ లో అరుదైన రికార్డు నెలకొల్పిన క్రిస్ గేల్

  • 38 సిక్సర్లతో చరిత్ర
  • ఏబీ డివిల్లీర్స్ రికార్డు తెరమరుగు
  • పాకిస్థాన్ తో మ్యాచ్ లో గేల్ దూకుడు

విధ్వంసక బ్యాటింగ్ కు పెట్టిందిపేరైన విండీస్ వీరుడు క్రిస్ గేల్ ప్రపంచకప్ లో అరుదైన రికార్డు సాధించాడు. వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు. తన కెరీర్లో ఐదో ప్రపంచకప్ ఆడుతున్న గేల్ 38 సిక్సర్లతో సరికొత్త రికార్డు నమోదుచేశాడు. ఇప్పటివరకు ఆ రికార్డు దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిల్లీర్స్ పేరిట ఉంది. నాలుగు వరల్డ్ కప్ లు ఆడిన డివిల్లీర్స్ 37 సిక్సర్లు కొట్టాడు. పాకిస్థాన్ తో నాటింగ్ హామ్ లో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో హసన్ ఆలీ బౌలింగ్ వరుసగా రెండు సిక్స్ లు బాదిన గేల్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

కాగా, 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన వెస్టిండీస్ 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. గేల్ అర్ధసెంచరీ సాధించి అవుటయ్యాడు. 

More Telugu News