union independent ministers: కేంద్ర స్వతంత్ర మంత్రులకు శాఖలు ఖరారు.. ఎవరెవరికి ఏయే శాఖలంటే..!

  • కిరణ్ రిజిజుకు క్రీడలు, యువజన శాఖ
  • ఇందర్ జిత్ సింగ్ కు గణాంకాల శాఖ
  • హర్దీప్ సింగ్ పూరికి పౌర విమానయాన శాఖ

నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం నిన్న ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కొత్త కేంద్ర స్వతంత్ర మంత్రులకు కాసేపటి క్రితం శాఖలను కేటాయించారు. ఎవరెవరికి ఏయే శాఖలు దక్కాయంటే...

  • సంతోష్ కుమార్ గంగ్వార్: లేబర్ మరియు ఎంప్లాయ్ మెంట్ శాఖ (ఇండిపెండెంట్)
  • ఇందర్ జిత్ సింగ్: గణాంకాల శాఖ (ఇండిపెండెంట్), ప్రణాళిక శాఖ (ఇండిపెండెంట్)
  • శ్రీపాద్ నాయక్: ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునానీ, సిద్ద, హోమియోపతి శాఖ (ఇండిపెండెంట్), రక్షణ శాఖ సహాయమంత్రి
  • జితేంద్ర సింగ్: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ (ఇండిపెండెంట్), ప్రధాని కార్యాలయం సహాయ మంత్రి... ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల సహాయ మంత్రి... అటామిక్ ఎనర్జీ సహాయ మంత్రి, అంతరిక్ష శాఖ సహాయమంత్రి
  • కిరణ్ రిజిజు: క్రీడలు, యువజన శాఖ (ఇండిపెండెంట్), మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
  • ప్రహ్లాద్ సింగ్ పటేల్: టూరిజం మరియు సాంస్కృతిక శాఖ (ఇండిపెండెంట్)
  • రాజ్ కుమార్ సింగ్: పునరుత్పాదక శక్తి శాఖ (ఇండిపెండెంట్), స్కిల్ డెవలప్ మెంట్ మరియు ఎంటర్ ప్రిన్యూర్ షిప్ శాఖ సహాయమంత్రి
  • హర్దీప్ సింగ్ పూరి: హౌసింగ్ మరియు అర్బర్ వ్యవహారాల శాఖ (ఇండిపెండెంట్), పౌర విమానయాన శాఖ (ఇండిపెండెంట్), పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ సహాయ మంత్రి
  • మన్షుక్ మండవీయ: షిప్పింగ్ (ఇండిపెండెంట్), కెమికల్స్ మరియు ఫర్టిలైజర్స్ సహాయ మంత్రి

More Telugu News