Sonal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ప్రేమాయణం కాదంటున్న 'లెజండ్' భామ 
  • ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి 
  • సంక్రాంతికి శ్రీకాంత్ అడ్డాల సినిమా

*  'లెజండ్', 'పండగ చేస్కో' వంటి తెలుగు సినిమాలలో నటించిన బాలీవుడ్ భామ సోనాల్ చౌహాన్ గత కొన్నాళ్లుగా క్రికెటర్ కె.ఎల్.రాహుల్ తో ప్రేమాయణం నడుపుతోందంటూ వార్తలొస్తున్నాయి. అయితే, తమ మధ్య అలాంటి ప్రేమ ఏమీ లేదని, తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని ఈ ముద్దుగుమ్మ తాజాగా తేల్చి చెప్పింది.
*  రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ చిత్రంలో మరో హీరోయిన్ ఎవరన్నది ఇంకా తేలలేదు. చరణ్ సరసన ఇందులో అలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ పక్కన నటించే తార కోసం అన్వేషణ జరుగుతోంది. ఈ పాత్రకు హాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేసే పనిలో చిత్రం యూనిట్ వుందని తాజా సమాచారం.  
*  'బ్రహ్మోత్సవం' తర్వాత గ్యాప్ తీసుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన తదుపరి చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్లో చేయనున్నాడు. నాని హీరోగా నటించే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. సంక్రాంతికి దీనిని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.

More Telugu News