Vizag: విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో నాలుగు మందుపాతర్లు వెలికితీసిన పోలీసులు

  • నిర్వీర్యం చేసిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్
  • పోలీస్ అవుట్ పోస్టు వద్ద ఐఈడీ ల్యాండ్ మైన్లు
  • ఒక్కో మందుపాతరలో 10 కేజీల పేలుడు పదార్థం

విశాఖ ఏజెన్సీ ఏరియాలో పెనుప్రమాదం తప్పినట్టయింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని జి.మాడుగుల మండలంలోని కొత్తగా నిర్మితమవుతున్న  ఓ పోలీసు అవుట్ పోస్టు వద్ద భూమిలో పాతిపెట్టిన మందుపాతర్లను భద్రతా సిబ్బంది వెలికి తీశారు. రిమోట్ సెన్సర్ కు అనుసంధానించిన నాలుగు ఐఈడీ పేలుడు పదార్థాల ల్యాండ్ మైన్లను యాంటీ నక్సల్ స్క్వాడ్ కనుగొంది. ఒక్కో మందుపాతరలో 10 కేజీల పేలుడు పదార్థం ఉన్నట్టు గుర్తించారు.

ఆరు నెలల క్రితం ఇదే ప్రాంతంలో మావోలు మందుపాతర పేల్చగా ఇద్దరు గాయపడ్డారు. ఇప్పుడు అదే ప్రాంతంలో ఏకంగా 4 మందుపాతర్లు బయటపడడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. విశాఖ రూరల్ ఎస్పీ బాబూజీ ఆధ్వర్యంలో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ అన్ని మందుపాతర్లను నిర్వీర్యం చేసింది. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకునే ఈ మందుపాతర్లు అమర్చినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

More Telugu News