Narendra Modi: భారీ సైజులో మోదీ క్యాబినెట్... జాబితా ఇదిగో!

  • పాతవారితో పాటు కొత్తవారికి కూడా క్యాబినెట్ లో చోటు
  • తొలిసారిగా అమిత్ షాకు స్థానం
  • రాష్ట్రపతి భవన్ లో కార్యక్రమం

సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం ద్వారా కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. కొద్దిసేపటిక్రితం రాష్ట్రపతిభవన్ లో పదవీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. వరుసగా రెండోసారి ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

ఈ సందర్భంగా మోదీతో పాటు మరికొందరు ఎంపీలు కూడా కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, రాంవిలాస్ పాశ్వాన్, సదానంద గౌడ, స్మృతీ ఇరానీ, ప్రకాశ్ జవదేకర్, పియూష్ గోయల్ తదితరులు కేంద్ర మంత్రులుగా కొత్త క్యాబినెట్ లో అడుగుపెట్టారు. ఇక వీరే కాకుండా మరికొందరు ఎంపీలు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం మీద మోదీ తాజా మంత్రివర్గం చూస్తుంటే భారీసైజులో కనిపిస్తోంది. కాగా, బీజేపీ చీఫ్ అమిత్ షా తొలిసారి క్యాబినెట్ లో అడుగుపెట్టారు.

మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన ఇతరులు వీరే...

  • రమేశ్ పోఖ్రియాల్
  • అర్జున్ ముండా
  • హర్షవర్ధన్
  • ధర్మేంద్ర ప్రధాన్
  • ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
  • ప్రహ్లాద్ జోషి
  • మహేంద్రనాథ్ పాండే
  • అరవింద్ సావంత్
  • గిరిరాజ్ సింగ్
  • గజేంద్ర సింగ్ షెకావత్
  • సంతోష్ గాంగ్వర్
  • నరేంద్ర సింగ్ తోమర్
  • రవిశంకర్ ప్రసాద్
  • హర్ సిమ్రత్ కౌర్ బాదల్
  • థావర్ చంద్ గెహ్లాట్
  • జయశంకర్
  • జితేంద్ర సింగ్
  • కిరణ్ రిజిజు
  • రాజ్ కుమార్ సింగ్
  • హరిదీప్ సింగ్ పూరి
  • మన్ సుఖ్ మాండవియా
  • అశ్వినీ కుమార్ చౌబే
  • అర్జున్ రామ్ మేఘ్వాల్
  • వీకే సింగ్
  • కృష్ణ పాల్ గూర్జర్
  • జి.కిషన్ రెడ్డి
  • రాందాస్ అథవాలే
  • నిత్యానంద్ రాయ్
  • ఫగ్గన్ సింగ్ కులస్తే
  • సాధ్వీ నిరంజన్ జ్యోతి
  • శ్రీపాద యశో నాయక్
  • ధన్వేరావ్ సాహిబ్
  • పురుషోత్తం రూపాలా
  • బాబుల్ సుప్రియో
  • సంజయ్ శ్యామ్ రావు
  • అనురాగ్ సింగ్ ఠాకూర్
  • సంజీవ్ కుమార్
  • రేణుకా సింగ్
  • అంగాడి సురేశ్
  • నిత్యానంద్ రాయ్
  • రామేశ్వర్ తేలి
  • ప్రతాప్ చంద్ర
  • వి.మురళీధరన్
  • సోంప్రకాశ్
  • కైలాష్ చౌదరి
  • దేబశ్రీ చౌదరి
  • రావ్ ఇంద్రజిత్ సింగ్
  • ప్రహ్లాద్ పటేల్
ఓవరాల్ గా తాజా మంత్రివర్గంలో 58 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వారిలో 25 మంది కేంద్రమంత్రులుగా, 9 మంది కేంద్ర స్వతంత్ర మంత్రులుగా, 24 మంది కేంద్ర సహాయమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

More Telugu News