Rajinikanth: మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భార్యతో కలిసి హాజరైన రజనీకాంత్

  • కాసేపట్లో మోదీ ప్రమాణస్వీకారం
  • ముస్తాబైన రాష్ట్రపతిభవన్
  • ప్రముఖుల సందడి

నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా పదవీప్రమాణం చేయనున్న వేళ ఢిల్లీలో తారాతోరణం కొలువైంది. రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులతో పాటు సినీ తారలతో రాష్ట్రపతి భవన్ పరిసరాలు కళకళలాడిపోతున్నాయి. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ కార్యక్రమంలో కనిపించారు. రజనీ తన అర్ధాంగి లతతో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఇతర ప్రముఖులతో మాట్లాడుతూ రజనీకాంత్ ఉత్సాహంగా దర్శనమిచ్చారు.

More Telugu News