Jagan: ఎన్ని కుట్రలు చేసినా కెరటంలా పైకి లేస్తా... ఎనిమిదేళ్ల నాడే చెప్పిన జగన్!

  • మాటే ముఖ్యమని నాన్న చెప్పారు
  • ఎలా బతికామన్నదే ముఖ్యం
  • 2011, జూలైలో ఆళ్లగడ్డలో జగన్ ప్రతిజ్ఞ

"మాటే నాకు ముఖ్యం. మా నాన్న నాకు నేర్పించింది ఒకటే ఒకటి. ఎన్నాళ్లు బతికామన్నది కాదు ముఖ్యం. బతికినన్నాళ్లూ ఎలా బతికామన్నది ముఖ్యం. ఇదే మా నాన్న నాకు నేర్పించారన్న ఒకే ఒక్క విశ్వాసంతో ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. బహుశా నా కాళ్లు విరగ్గొడతారేమో వీళ్లు. బహుశా నా వెన్నెముక కూడా విరగ్గొడతారేమో వీళ్లు... నాకు తెలీదు. కానీ ఒక్కటైతే నేను చెబుతున్నా. ఏమి చేసినా కూడా, మళ్లీ కెరటంలా పైకి లేస్తానని ఇవాళ చెబుతున్నా" అని జగన్ గతంలోనే చేసిన ప్రతిజ్ఞను నేడు నెరవేర్చుకుంటున్నారు.

2011, జూలై 20వ తేదీన ఆళ్లగడ్డలో జరిగిన ఓ బహిరంగ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఇవి. తనను అణగదొక్కాలని చూసినా, తిరిగి పైకి వస్తానని ఏ మాత్రం వెన్నుచూపేది లేదని జగన్ గతంలో పలుమార్లు చేసిన వ్యాఖ్యలను నేడు తెలుగు వార్తా చానళ్లు చూపిస్తున్నాయి. మరికాసేపట్లో జగన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.

2011 తరువాత అక్రమాస్తులు, క్విడ్ ప్రొకో కేసుల్లో జగన్ జైలుశిక్షను కూడా అనుభవించిన సంగతి తెలిసిందే. ఆపై 2014లో అధికారాన్ని చేజిక్కించుకోవడంలో విఫలం అయినా, పట్టువీడక, దాదాపు 3,500 కిలోమీటర్ల దూరం నడిచి, ప్రజల్లోకి వెళ్లి, వారి మద్దతుతోనే ఇప్పుడు నవ్యాంధ్రకు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు.

More Telugu News