Brazil: ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ లా తయారయ్యేందుకు కండరాల్లోకి నూనె పంపింగ్... బ్రెజిల్ లో కండల పిచ్చోడు!

  • కండరాల్లోకి నువ్వుల నూనె
  • ప్రమాదకరం అంటున్న వైద్యులు
  • అయినా లెక్కచేయని బాడీబిల్డర్

బ్రెజిల్ కు చెందిన వాల్దిర్ సెగాటో ఇప్పుడు అంతర్జాతీయంగా మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సెగాటో ఓ బాడీబిల్డర్. అయితే, పెంచిన కండల పట్ల అతడికి సంతృప్తిలేదు. హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ లా కొండల్లాంటి కండలు పెంచాలన్నది అతడి ఆశయం. దాంతో, కండరాలు మరింత ఉబ్బెత్తుగా కనిపించేందుకు నువ్వుల నూనెను ఒంట్లోకి ఇంజెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టాడు. నువ్వుల నూనెలో పెయిన్ కిల్లర్స్, ఆల్కహాల్ కలిపి ఆ మిశ్రమాన్ని సిరంజీల ద్వారా కండరాల్లోకి ఎక్కించేవాడు.

అయితే, ఇది తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుందని, ప్రాణాంతకం అని డాక్టర్లు హెచ్చరించినా సెగాటో మాత్రం పట్టించుకోవడంలేదు. ధమనులు పూర్తిగా మూసుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని, ఇన్ఫెక్షన్లు కూడా ప్రబలుతాయని డాక్టర్లు చెప్పారు. 50 ఏళ్ల సెగాటో మాత్రం తన కండలను 23 అంగుళాల వరకు పెంచడమే లక్ష్యం అంటూ మూర్ఖంగా నూనె పంపింగ్ చేస్తున్నాడు. గత మూడేళ్లుగా సెగాటో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కండలను పెంచడమే పనిగా పెట్టుకున్నాడు.

More Telugu News