Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏదో జరిగింది.. లేదంటే ఎందుకు ఓడిపోతాం?: కోడెల శివప్రసాదరావు

  • అనుకోని ఓటమి చవిచూశాం
  • కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి
  • ఉండవల్లిలో మీడియాతో మాజీ స్పీకర్

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు ఈరోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏదో  జరిగిందనీ, అందుకే ఓడిపోయామని ఆరోపించారు. లేదంటే టీడీపీ ఎందుకు ఓడిపోతుందని ప్రశ్నించారు. గుంటూరులోని ఉండవల్లిలో ఈరోజు టీడీపీ శాసనసభాపక్ష సమావేశానికి హాజరైన అనంతరం కోడెల మీడియాతో మాట్లాడారు.

టీడీపీ అనుకోని ఓటమి చవిచూసిందని కోడెల తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో జరిగిందనీ, ఈ విషయాన్ని కొందరు తనకు చెప్పారని కోడెల వ్యాఖ్యానించారు. ఈవీఎంలపై అనుమానాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈసీదేనని స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందనీ, ఓడిపోయామని కుంగిపోవద్దని ధైర్యం చెప్పారు.

More Telugu News