karthikeya: 'గుణ 369' నుంచి కార్తికేయ ఫస్టులుక్

  • విభిన్నమైన కథాంశాలతో కార్తికేయ
  • అర్జున్ జంధ్యాలతో 'గుణ 369'
  • మరింత హ్యాండ్సమ్ గా కార్తికేయ 

కార్తికేయ వైవిధ్యభరితమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక వైపున 'హిప్పీ' చేస్తూ, మరో వైపున 'గుణ 369' సినిమా చేస్తున్నాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. రెడ్ కలర్ షర్ట్ తో .. లుంగీ పైకెత్తి కట్టి .. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఈ పోస్టర్ లో కార్తికేయ కనిపిస్తున్నాడు.

ఈ లుక్ లో ఆయన మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, తిరుమల రెడ్డి - అనిల్ కడియాల నిర్మిస్తున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో కార్తికేయ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.

More Telugu News