paruchuri: 'మౌనపోరాటం' రష్ చూసిన రామోజీరావు గారు మార్పులు చేయమన్నారు: పరుచూరి గోపాలకృష్ణ

  • యమునను వెతుక్కుంటూ తొలి అవకాశం వచ్చింది
  • కథలో మార్పులు చేసి మళ్లీ షూట్ చేశాము
  • యమునకి మంచి పేరు తెచ్చిపెట్టింది  

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో సీనియర్ హీరోయిన్ 'యమున' గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "యమునను తొలిసారిగా ఒక సినిమా కోసం మేము తీసుకున్నాము. అయితే 'మౌనపోరాటం' సినిమాకి ఆ అమ్మాయి అయితే కరెక్ట్ గా సరిపోతుందనీ, ఆ అమ్మాయికి తమ సినిమా చేసే ఛాన్స్ ఇవ్వమని అట్లూరి రామారావుగారు కాల్ చేసి నాకు చెప్పారు.

దాంతో నేను 'యమున'ను 'మౌనపోరాటం' చేయడానికి పంపించాను. ఆ సినిమా రష్ చూసిన రామోజీరావుగారు, తాను అనుకున్నట్టుగా రాలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. దాంతో అట్లూరి రామారావుగారు నాకు కాల్ చేసి, మార్పులు చేయమని అడిగారు. దర్శకుడు మోహన్ గాంధీ - నేను కలిసి ఆర్డర్ సెట్ చేసుకుని మళ్లీ షూటింగుకి వెళ్లడం జరిగింది. ఇప్పటికీ ఆ సినిమా చూస్తుంటే, తొలి సినిమాలోనే అంతటి గొప్ప పాత్ర యమునకి లభించడం నిజంగా ఆమె అదృష్టం అనిపిస్తూ ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News