Andhra Pradesh: కడపకు బయలుదేరిన జగన్.. వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్న నేత!

  • తొలుత పెద్దదర్గా సందర్శన
  • సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక పూజలు
  • రేపు మధ్యాహ్నం 12.23 గంటలకు ప్రమాణస్వీకారం

ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఈరోజు జగన్ కడపకు బయలుదేరారు. కడప పర్యటనలో భాగంగా ఈరోజు జగన్ పెద్దదర్గాను సందర్శిస్తారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి పులివెందులకు వెళ్లి అక్కడి సీఎస్ఐ చర్చిల్లో ప్రార్థనల్లో పాల్గొంటారు.

ఆ తర్వాత ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించనున్నారు. పర్యటన ముగిశాక ఈరోజు సాయంత్రమే జగన్ విజయవాడకు చేరుకుంటారు. రేపు మధ్యహ్నం 12.23 గంటలకు వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

More Telugu News