TRS: కవిత, నేను ఢక్కాముక్కీలు తిన్నాం.. ఒక్క ఓటమితో కుంగిపోయే ప్రసక్తే లేదు: కేటీఆర్‌

  • లోక్ సభ ఎన్నికల్లో విచిత్రమైన ట్రెండ్ కనిపించింది
  • 6 శాతం ఓట్లు పెరిగినా  తొమ్మిది సీట్లే వచ్చాయి
  • కవిత ఓటమికి కారణం రైతులు కాదు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఊహించిన స్థానాలను సొంతం చేసుకోలేకపోవడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్ లో మీడియాతో ఈరోజు ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో విచిత్రమైన ట్రెండ్ కనిపించిందని అన్నారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ఎంపిక సరిగా లేదన్న వాదనతో ఏకీభవించనని చెప్పారు. గత లోక్ సభ ఎన్నికల్లో 34 శాతం ఓట్లతో 11 లోక్ సభ స్థానాలు గెలుచుకున్నామని, ఈసారి మాత్రం 6 శాతం ఓట్లు పెరిగినా తమకు తొమ్మిది సీట్లే వచ్చాయని అన్నారు.  

ఈ సందర్భంగా నిజామాబాద్ నుంచి ఎంపీగా ఓటమిపాలైన తన సోదరి కవిత గురించి ప్రస్తావించారు. కవిత ఓటమికి రైతులు కారణం కాదని, అక్కడ నామినేషన్లు వేసింది రైతులు కాదని, రాజకీయ కార్యకర్తలేనని అన్నారు. జగిత్యాల నియోజకవర్గంలోని ఓ కాంగ్రెస్ నేత ఇంటి  నుంచి 93 మంది నామినేషన్లు వేశారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కావడం వల్లే కవిత ఓడిపోయారని అన్నారు. కవిత, తాను అనేక ఢక్కాముక్కీలు తిన్నామని, ఒక్క ఓటమితో కుంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

More Telugu News