Karnataka: యడ్యూరప్ప చెప్పినట్టు జరిగితే నా పదవికి రాజీనామా చేస్తా: సిద్ధరామయ్య

  • సర్కార్ కూలిపోవడం ఖాయమన్న యడ్యూరప్పపై ఫైర్
  • చెప్పినట్టు జరగకపోతే యడ్డీ రాజీనామా చేస్తారా?
  • మా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పూ లేదు

కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం త్వరలో కూలిపోవడం ఖాయమంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధరామయ్య మండిపడ్డారు. యడ్యూరప్ప ప్రకటించినట్టుగా జూన్ 1లోగా ప్రభుత్వం పడిపోతే తన పదవికి రాజీనామా చేస్తానని సిద్ధరామయ్య ప్రకటించారు. అలా జరగని పక్షంలో యడ్యూరప్ప ఆయన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా? అని సిద్ధరామయ్య సవాల్ విసిరారు.

కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ముప్పూ లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఐదేళ్లూ పూర్తిగా పరిపాలిస్తుందని, ఇందులో ఎటువంటి అనుమానం లేదని ఘంటాపథంగా చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ తమతోనే ఉన్నారని, ఎవరూ పార్టీని వీడబోరని స్పష్టం చేశారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేసే అధికారం బీజేపీకి ఎవరిచ్చారని, ఆ అధికారం రాజ్యాంగంలోని ఏ పేజీలో ఉందని ప్రశ్నించారు.

More Telugu News