TTD: వివాదాస్పదమవుతున్న టీటీడీ పాలక మండలి సమావేశం

  • మూడు నెలలకోసారి మండలి సమావేశం
  • అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న వైసీపీ
  • సీఎస్‌, ఈవోకు ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడి

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన నేపథ్యంలో టీటీడీ పాలకమండలి సమావేశం వివాదాస్పదమవుతోంది. ప్రతి మూడు నెలలకొకసారి పాలక మండలి సమావేశం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న టీటీడీ పాలక మండలి సమావేశంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. టీడీపీ ఓడిపోయినప్పటికీ టీటీడీ పాలకమండలి పదవులకు రాజీనామా చేయకుండా కొనసాగడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పాలకమండలి తీరుపై సీఎస్‌తోపాటు టీటీడీ ఈవోకు ఫిర్యాదు చేయనున్నట్టు వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రేపు పాలకమండలి సమావేశం జరుగుతుందో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాలకమండలి సభ్యులు మాత్రం తిరుపతికి చేరుకుంటున్నారు.

More Telugu News