simbu: మళ్లీ ఒక్కటైన శింబు - హన్సిక

  • హన్సిక 50వ చిత్రంగా 'మహా'
  • ప్రత్యేకమైన పాత్రలో శింబు
  •  తొలగిపోయిన మనస్పర్థలు  

శింబు - హన్సిక కొంతకాలం క్రితం ప్రేమించుకున్నారు. ఆ తరువాత వాళ్లిద్దరి మధ్య మస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఇద్దరూ విడిపోయి చాలా రోజులు గడిచిపోయాయి. హన్సిక దూరం కావడం వలన కొంతకాలం పాటు డిప్రెషన్ లోకి వెళ్లిన శింబు, ఆ తరువాత నిదానంగా దార్లో పడ్డాడు. అలాంటి శింబు - హన్సిక కలిసి నటించనున్నారనేది తాజా సమాచారం.

హన్సిక 50వ చిత్రంగా, జమీల్ దర్శకత్వంలో 'మహా' రూపొందుతోంది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో శింబు కనిపించనున్నట్టు సమాచారం. ఆయన పేరును హన్సికనే సూచించిందనీ, ఆమె రిక్వెస్ట్ చేయడం వల్లనే శింబు ఓకే అన్నాడని దర్శకుడే స్వయంగా చెప్పాడు. ఈ సినిమాతో తాము మళ్లీ కలిసిపోయినట్టుగా హన్సిక కూడా స్పందించింది. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్లో కొన్ని రొమాంటిక్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. విడిపోయిన జంట .. కలిసి తెరపై కనిపించనుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

More Telugu News