Jagan: జగన్ బీకాంలో ఫస్ట్ క్లాస్.. మురిసిపోతున్న ప్రగతి మహావిద్యాలయ యాజమాన్యం

  • కాలేజీలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
  • ప్రగతి మహావిద్యాలయలో డిగ్రీ చదివిన జగన్
  • 1991-94 మధ్య గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వైనం

జగన్ ముఖ్యమంత్రి అవుతున్న నేపథ్యంలో ఆయన విద్యాభ్యాసం సాగించిన హైదరాబాద్ ప్రగతి మహావిద్యాలయ కళాశాల యాజమాన్యం ఆనందంతో పొంగిపోతోంది. తమ కాలేజీలో చదివిన విద్యార్థి ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం పట్ల తాము ఎంతో సంతోషిస్తున్నామని మేనేజ్ మెంట్ తెలిపింది. జగన్ డిగ్రీలో బీకాం తీసుకున్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్లస్ టూ చదివిన జగన్ ఆపై గ్రాడ్యుయేషన్ ప్రగతి మహావిద్యాలయలో పూర్తిచేశారు. జగన్ 1991 నుంచి 94 మధ్య ఈ కాలేజ్ లోనే చదివారు.

అప్పట్లో జగన్ తో చదివిన విద్యార్థులు నేడు కాలేజీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమావేశానికి కాలేజీ ప్రిన్సిపాల్ కూడా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, జగన్ బీకాంలో ఫస్ట్ క్లాస్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. జగన్ తో పాటు చదివిన వాళ్లలో చాలామంది ఉన్నతస్థాయిలో ఉన్నారని, అది తమకెంతో గర్వకారణం అని పేర్కొన్నారు. కాగా, జగన్ ఈ నెల 30న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనుండగా, అదే రోజున ప్రగతి మహావిద్యాలయ కాలేజీలో వేడుకలు నిర్వహిస్తున్నారు.

More Telugu News