Andhra Pradesh: ఏపీలో అంతులేని అవినీతి.. సమూల ప్రక్షాళన దిశగా జగన్ అడుగులు!: విజయసాయిరెడ్డి

  • ఆశ్రిత పక్షపాతం, కులప్రీతి ఎక్కువయ్యాయి
  • జగన్ ప్రజారంజక పాలన అందించబోతున్నారు
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత

ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లలో కులప్రీతి, ఆశ్రితపక్షపాతం నెలకొందనీ, అంతులేని అవినీతి జరిగిందని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ పరిస్థితులను సరిదిద్దాలంటే సమూల ప్రక్షాళన అవసరమని అభిప్రాయపడ్డారు. వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజారంజకమైన సుపరిపాలనే ధ్యేయంగా సాగుతున్నారని చెప్పారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘అయిదేళ్ళలో అంతులేని అవినీతి, కులప్రీతి, ఆశ్రిత పక్షపాతంతో కునారిల్లిపోతూ అస్తవ్యస్తంగా మారిన పాలనా వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలంటే కాయకల్ప చికిత్సతో సమూల ప్రక్షాళన చేయడం అనివార్యం. ఆ దిశగానే మన అధినేత శ్రీ వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. ప్రజా రంజకమైన సుపరిపాలనే ధ్యేయంగా’ అని ట్వీట్ చేశారు.

More Telugu News