SVBC: వయసు సహకరించడం లేదు...బాధ్యతలు మోయలేను : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు

  • వెంకటేశ్వర భక్తి చానల్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా
  • తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆధ్యాత్మిక చానల్‌
  • 2015 నుంచి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఉన్న రాఘవేంద్రరావు

ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు శ్రీవేంకటేశ్వరా భక్తిచానల్‌ (ఎస్‌వీబీసీ) చైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆధ్యాత్మిక చానెల్‌ను నిర్వహిస్తోంది. 2015 నుంచి టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్న దర్శకేంద్రుడు ఎస్‌వీబీసీ చానల్‌ బాధ్యతలను చూస్తున్నారు. అయితే వయోభారంతో ప్రస్తుతం ఈ బాధ్యతలు నిర్వహించలేకపోతున్నానని ఆయన పేర్కొన్నారు. టీటీడీ యాజమాన్యానికి, సిబ్బందికి ఆ తిరుమలేశుడి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నానని తెలిపారు. ఇన్నాళ్లు తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

More Telugu News