Palnadu: పల్నాడులోని పలు గ్రామాల్లో పడగవిప్పిన ఫ్యాక్షన్... అదనపు బీఎస్ఎఫ్ బలగాల తరలింపు!

  • ఎన్నికల వేళ ప్రశాంతంగా ఉన్న గ్రామాలు
  • ఆపై పలు చోట్ల ఘర్షణ వాతావరణం
  • ఇరు వర్గాల వారికీ పోలీసుల కౌన్సెలింగ్

ఎన్నికలు ముగిసిన తరువాత పల్నాడులోని పలు గ్రామాల్లో ఫ్యాక్షన్ గొడవలు తలెత్తకుండా పలు చర్యలు తీసుకున్నప్పటికీ, అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు జరుగున్న నేపథ్యంలో, నాలుగు కంపెనీల బీఎస్‌ఎఫ్‌ బలగాలను పిలిపించినట్టు పిడుగురాళ్ల రూరల్‌ ఎస్పీ రాజశేఖర్‌ బాబు తెలిపారు. ఎక్కడా గొడవలు జరుగకుండా చూడటమే తమ లక్ష్యమని, ఫ్యాక్షన్ గ్రామాల్లో పోలీసు పికెట్లు ఏర్పాటు చేయనున్నామని ఆయన చెప్పారు.

ఎన్నికలు జరిగిన సమయంలో ఈ ప్రాంతానికి కేంద్ర బలగాలు తక్కువగా వచ్చాయని గుర్తు చేసిన ఆయన, ఆ సమయంలో పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేసిందన్నారు. ఫలితాల తరువాత గొడవలు జరుగుతున్న ప్రాంతాల్లో రెండు వర్గాల వారినీ పిలిపించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నామని, గొడవలు కొన్ని ప్రాంతాల్లోనే జరిగాయని, ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు ఎవరైనా సరే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

More Telugu News