Payal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సంచలన పాత్రలో పాయల్ రాజ్ పుత్ 
  • వచ్చే నెలలో మంచు విష్ణు 'ఓటర్' 
  • గోపీచంద్ దర్శకత్వంలో రవితేజ

 *  'ఆర్ఎక్స్ 100' ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన కథానాయిక పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు వ్యభిచారిగా సంచలన పాత్రను పోషిస్తోంది. వంశీ కృష్ణ దర్శకత్వంలో రూపొందే 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంలో ఈ ముద్దుగుమ్మ ఇలా వ్యభిచారి పాత్రలో కనిపించనుంది. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు.
*  మంచు విష్ణు హీరోగా నటించిన 'ఓటర్' చిత్రం ఎట్టకేలకు విడుదలవుతోంది. రెండేళ్ల క్రితమే పూర్తయిన ఈ చిత్రం పలు కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. తాజాగా సెన్సార్ కూడా పూర్తయింది. వచ్చే నెలలో దీనిని రిలీజ్ చేస్తున్నారు.
*  ప్రస్తుతం 'డిస్కో రాజా' చిత్రంలో నటిస్తున్న రవితేజ మరో చిత్రాన్ని కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. దీనికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తాడు. సెప్టెంబర్ నుంచి షూటింగ్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.

More Telugu News