Sri Lanka: శ్రీలంక నుంచి లక్ష్యద్వీప్ కు 15 మంది ఉగ్రవాదులు పయనం... కేరళ తీరంలో హైఅలర్ట్

  • నిఘా వర్గాల హెచ్చరికలు
  • కేరళలో అన్ని మెరైన్ పోలీస్ స్టేషన్లలో అప్రమత్తత
  • తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం

తాజాగా భారత్ లో మరోసారి ఉగ్రకలకలం రేగింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు కొత్త అడ్డాగా మారిన శ్రీలంక నుంచి 15 మంది ఉగ్రవాదులు లక్ష్యద్వీప్ బయల్దేరినట్టు భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో కేరళ తీరవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ముష్కరులు కొన్ని పడవల్లో అరేబియా సముద్రంలో ప్రవేశించి లక్ష్యద్వీప్ దిశగా వెళుతున్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇది అత్యంత కచ్చితత్వం కూడిన సమాచారం అంటూ కేరళ తీరంలోని అన్ని మెరైన్ పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు.

లక్ష్యద్వీప్ లో అడుగుపెట్టడం ద్వారా, అక్కడ్నించి ఇతర మార్గాల్లో భారత ప్రధానభూభాగంలోకి ప్రవేశించాలన్నది ఉగ్రవాదుల ప్లాన్ అని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం కేరళ తీరం వెంబడి భద్రతను మరింత పెంచారు. అనుమానాస్పదంగా కనిపించే పడవలను తనిఖీ చేయాలని, సందేహాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.

More Telugu News