Stick: చేతిలో కర్ర, పగిలిన బీరు సీసాతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ వ్యక్తి హల్‌చల్

  • స్థానికులు పట్టుకునేందుకు యత్నించగా దాడి
  • పారిపోయి మురుగు కాల్వలో దాక్కొన్న వ్యక్తి
  • మునిసిపల్ సిబ్బంది సాయంతో అరెస్ట్ చేసిన పోలీసులు

చేతిలో కర్ర, పగిలిపోయిన బీరుసీసాతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన ఓ వ్యక్తిని పోలీసులు, మునిసిపల్ సిబ్బంది సాయంతో అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ వన్‌టౌన్ పరిధిలోని పాతబస్తీ పంజా సెంటర్‌లో ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి చేతిలో కర్ర, పగిలిపోయిన బీరు సీసాతో హల్‌చల్ చేశాడు. దీంతో స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఓ యువకుడిని కర్రతో కొట్టి అక్కడి నుంచి పారిపోయాడు.

సమాచారం అందుకున్న రెండో పట్టణ సీఐ ఎండీ ఉమర్, ఎస్సై సుబ్రహ్మణ్యంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే సదరు వ్యక్తి బీఆర్‌పీ-కొత్తపేట రోడ్డులోని జనసేన కార్యాలయానికి ఎదురుగా ఉన్న మురుగు కాల్వలో దాక్కున్నాడు. దీంతో పోలీసులు మునిసిపల్ సిబ్బంది సాయంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News