Jagan: జగన్ బయోపిక్ పై ఆసక్తి చూపిస్తున్న బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్

  • న్యూస్18లో జగన్ పై కథనం
  • ట్వీట్ చేసిన మహిళా పాత్రికేయురాలు
  • స్పందించిన స్టార్ డైరక్టర్ అనురాగ్ కశ్యప్

ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ పై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. జగన్ జీవితం తెరకెక్కిస్తే ఓ అద్భుతమైన చిత్రం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ ప్రభంజనం చూసి డీపీ సతీష్ అనే పాత్రికేయుడు న్యూస్18 మీడియా సంస్థ కోసం జగన్ పై ఓ కథనం రాశారు.

'సోనియా అవమానం, రెడ్డి ప్రతీకారం, ఆంధ్రా శాపం: కాల్పనికతను మించిన ఇతివృత్తం జగన్ ప్రస్థానం' పేరిట రాసిన ఆ కథనం నేషనల్ మీడియాలో సంచలనం అయింది. దీన్ని ప్రియా రమణి అనే మహిళా జర్నలిస్టు ట్వీట్ చేయగా అనురాగ్ కశ్యప్ స్పందించారు. తిరుగులేని కథాంశంతో ఈ చిత్రం త్వరలోనే పట్టాలు ఎక్కొచ్చంటూ రీట్వీట్ చేశారు.

More Telugu News