yoga: మూడో బిడ్డ పుడితే కఠిన చర్యలు తీసుకోవాలి: బాబా రాందేవ్ సూచన

  • ఇద్దరు పిల్లలకు మించి కనకుండా చట్టం తీసుకురావాలి
  • మూడో బిడ్డ పుడితే ఆ బిడ్డకు ఓటు హక్కు కల్పించొద్దు
  • ప్రభుత్వ పథకాల లబ్ధి మూడో బిడ్డకు అందకూడదు

మన దేశంలో జనాభా పెరుగుదలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సూచించారు. ఇద్దరు పిల్లలకు మించి కనకుండా ప్రభుత్వం చట్టం తీసుకురావాలని, మూడో బిడ్డ పుడితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒకవేళ మూడో బిడ్డ పుడితే భవిష్యత్తులో ఆ బిడ్డకు ఓటు హక్కు కల్పించకూడదని, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేలా నిషేధం విధించాలని సూచించారు. అంతేకాకుండా, ప్రభుత్వ పథకాల ద్వారా అందే లబ్ధి మూడో బిడ్డకు అందకుండా చూడాలని సూచించిన బాబా రాందేవ్, మతంతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ జనాభా నియంత్రణ పాటించాలని సూచించారు.

గోవధ,మద్యంలపై సంపూర్ణ నిషేధం విధించాలి

ఇస్లామిక్ దేశాల్లో మాదరి మన దేశంలోనూ మద్యం ఉత్పత్తి, అమ్మకం, విక్రయాలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. రుషులకు జన్మస్థలమైన భారత్ లో మద్య నిషేధంపైనా, గోవధపైనా సంపూర్ణ నిషేధం విధించాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోవధపై సంపూర్ణ నిషేధం విధించడం ద్వారా వాటిని తరలించే వారికి గో సంరక్షకులకు మధ్య ఘర్షణలు ఆగిపోతాయని అభిప్రాయపడ్డారు. గోమాంసమే తినాలనుకునే వారే మరే ఇతర మాంసాన్ని అయినా తినొచ్చంటూ వ్యాఖ్యానించారు.

More Telugu News