Nagababu: నవరత్నాలు కాన్సెప్ట్ ను జగన్ ఈ ఐదేళ్లలో చేసిచూపించాలి: నాగబాబు

  • జగన్ కు శుభాభినందనలు
  • జగన్ కు మా సహకారం ఎప్పుడూ ఉంటుంది
  • ఏపీలో ప్రజలకు సుపరిపాలన అందించాలి

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్ సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన నాగబాబు ఎన్నికల ఫలితాలపై ఓ వీడియో రిలీజ్ చేశారు. నా ఇష్టం పేరుతో విడుదల చేసిన ఈ వీడియోలో నాగబాబు మాట్లాడుతూ, ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారంటూ జగన్ కు శుభాభినందనలు తెలియజేశారు. జగన్ కు ఏపీ ప్రజలు అద్భుతమైన మెజారిటీ అందించారని, అందుకే జగన్ ప్రజలకు రుణపడి ఉంటారని తెలిపారు. ప్రధానంగా తన నవరత్నాల కాన్సెప్ట్ ను జగన్ ఈ ఐదేళ్లలో చేసి చూపించాల్సి ఉంటుందని, ప్రజల్లో ఆ నమ్మకం కలిగించాలని స్పష్టం చేశారు. ఏపీలో జగన్ సుపరిపాలన అందించే క్రమంలో తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు.

More Telugu News