Mamatha Benerji: రాజీనామాకు సిద్ధపడిన మమతా బెనర్జీ

  • హిందూ-ముస్లిం విభజనతో ఓట్లు చీలాయి
  • ఎమర్జెన్సీ తరహా పరిస్థితుల్ని సృష్టించారు
  • ఈసీకి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు సంచలన ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో అపజయాలకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆమె ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశానంతరం ఆమె మాట్లాడుతూ, తాను ముఖ్యమంత్రిగా కొనసాగదలుచుకోలేదని, ఈ విషయమై తమ పార్టీని ఒప్పిస్తున్నానని తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు రావడానికి కారణం హిందూ-ముస్లిం విభజన అని మమత పేర్కొన్నారు. దీంతో ఓట్లు కూడా చీలిపోయాయని మమత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితుల్ని సృష్టించారని ఆరోపించారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని వాపోయారు. బీజేపీ దగ్గర బాగా డబ్బుందని, ఎన్నికల్లో గెలిచేందుకు ప్రతి కుటుంబానికి రూ.5 వేలు పంపిణీ చేసిందని మమత ఆరోపించారు. అయితే మమత రాజీనామా నిర్ణయాన్ని పార్టీ అంతర్గత సమావేశంలో ఎవరూ సమర్ధించలేదని సమాచారం.  

More Telugu News